: మిషెల్ మార్ష్ ధాటికి కుప్పకూలిన ఇంగ్లండ్ టాపార్డర్
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న పోరాటం ఏకపక్షంగా మారింది. నిప్పులు చెరిగే బంతులతో మిషెల్ మార్ష్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడడంతో ఇంగ్లండ్ టాపార్డర్ కుప్పకూలింది. ఏడు ఓవర్లపాటు బౌలింగ్ చేసిన మిషెల్ మార్ష్ కేవలం 27 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. రూట్ వికెట్ తీసి స్టార్క్ శుభారంభం ఇస్తే, దానిని మార్ష్ కొనసాగించాడు. దీంతో ఇంగ్లండ్ కేవలం 22 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ టెయిలెండర్లు మాత్రమే ప్రతిఘటిస్తుండగా, ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.