: ఆధార్ తో ఓటర్ కార్డుల అనుసంధానం... మార్చ్ ఒకటి నుంచి ప్రారంభం


మార్చ్ ఒకటో తేదీ నుంచి ఓటర్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆగస్టు 15 లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓటర్ల జాబితాను ఆధార్ తో అనుసంధానం చేసే అంశంపై హైదరాబాదులోని ఎంసీహెచ్ఆర్డీలో చర్చ జరిగింది. ఈ సమావేశానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ వివరాల నమోదు కోసమే ఆధార్ ను అంనుసంధానం చేస్తున్నామని చెప్పారు. ఓటర్ కార్డులను ఆధార్ తో అనుసంధానించడం ద్వారా బోగస్ ఓటర్లను నివారించవచ్చని ఆయన తెలిపారు. ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచే విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని బ్రహ్మ స్పష్టం చేశారు. అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News