: ఘర్షణ జరిగితేనే కాని చర్చలకు రారా?: చంద్రులపై విరుచుకుపడ్డ గుత్తా


రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల విషయంలో పోలీసులు తన్నుకుంటే గాని చర్చలకు రారా? అని చంద్రబాబు, కేసీఆర్ లపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఇరు రాష్ట్ర పోలీసుల మధ్య ఘర్షణకు సీఎంలే కారణమని గుత్తా ఆరోపించారు. నేటి మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గొడవలు ముదిరిన తరువాతే ఇద్దరు సీఎంలు చర్చలకు వచ్చారని, తక్షణం ఎడమ కాల్వ నుంచి నీటిని విడుదల చేయకపోతే 2.50 లక్షల ఎకరాల్లోని పంటలు ఎండిపోతాయని తెలిపారు. రైతుల ప్రయోజనాలు తాకట్టు పెడుతూ సెంటిమెంట్ తో రాజకీయాలు చేయడమే ముఖ్యమంత్రులు పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. 'పంటలు ఎండిపోతే కనుక మీదే బాధ్యత' అని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News