: కేజ్రీవాల్ 'క్రేజీ' మంత్రివర్గం ఇదే!
ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్, ఆ వెంటనే తన మంత్రివర్గాన్ని విస్తరించారు. తొలుత మనీష్ సిసోడియా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. కొత్త మంత్రులకు శాఖలను కేటాయించే విషయంలోనూ ఆయన స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేడు ప్రమాణం చేసిన వారిలో సందీప్ కుమార్ (శిశు సంక్షేమం), సత్యేంద్ర జైన్ (వైద్య ఆరోగ్యం), గోపాల్ రాయ్ (రవాణా, కార్మిక శాఖలు), జితేంద్రసింగ్ తోమార్ (న్యాయ శాఖ), అసీం అహ్మద్ ఖాన్ లు ప్రమాణం చేశారు. మొత్తం ఆరుగురు మంత్రులను ఆయన తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయన రామ్ లీలా మైదానంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.