: ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఈ మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రానికి 8వ ముఖ్యమంత్రిగా ఆయన చేత లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రమాణం చేయించారు. ఆయన తరువాత ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు, ఆప్ అభిమానులు తరలివచ్చారు. కార్యక్రమం సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.