: బీజేపీ కార్యాలయంలోనే పసికందుపై కీచకపర్వం


కోల్ కతాలోని బీజేపీ కార్యాలయంలోనే సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన చోటుచేసుకుంది. బెహలా నగరంలోని మండల బీజేపీ ఆఫీసులో అయిదేళ్ల పసిబాలికపై ఓ యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. పాప కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పార్టీ ఆఫీసు తలుపు తట్టారు. దీంతో ఆ యువకుడు అక్కడ నుంచి పరారయ్యాడు. పార్టీ ఆఫీస్ లో రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను గమనించి, కోపోద్రిక్తులైన స్థానికులు బీజేపీ ఆఫీసుపై దాడికి ప్రయత్నించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికపై అత్యాచారం జరిగినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడు బీజేపీ ఆఫీస్ పక్కనున్న షాపు యజమాని కుమారుడని, ఆఫీస్ తాళాలు ఆ షాపులోనే ఉంటాయని బీజేపీ ప్రకటించింది. దీనిని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News