: ఇదేనా పధ్ధతి... సాగర్ ఘటనపై గవర్నర్ సీరియస్!


నిన్న నాగార్జున సాగర్ వద్ద పోలీసుల మధ్య జరిగిన గొడవపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు తలపడిన వ్యవహారంపై ఈ ఉదయం ఇరు రాష్ట్రాల డీజీపీలు వివరణ ఇవ్వగా, ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కొట్టుకుంటుంటే ఎందుకు జోక్యం చేసుకోలేదని గవర్నర్ డీజీపీలను ప్రశ్నించినట్లు సమాచారం. భద్రత కల్పించాల్సిన పోలీసులే కొట్టుకోవటం సరికాదని, వారు సంయమనం పాటించి ఉండాల్సిందని గవర్నర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News