: అద్భుత ఎలక్ట్రిక్ కారును రహస్యంగా తయారు చేస్తున్న యాపిల్!


ఆటోమోటివ్ టెక్నాలజీపై మక్కువ పెంచుకుంటున్న యాపిల్ సంస్థ అద్భుతరీతిలో పనితీరు చూపే సరికొత్త ఎలక్ట్రిక్ కారును రహస్యంగా తయారు చేస్తోందట. ఈ విషయాన్ని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వివరించినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఒక మినీ వ్యాన్ మాదిరిగా కనిపించే ఈ కారు రూపకల్పనకు మరింత కాలం పడుతుందని ఆయన వెల్లడించినట్టు తెలిపింది. ఈ కారులో ఇంటర్నెట్ నుంచి నావిగేషన్ వరకూ, సకల అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నట్టు పేర్కొంది. కాగా, అందరికీ అందుబాటు ధరలో లభించేలా ఎలక్ట్రిక్ కారును రూపొందించేందుకు గూగుల్, టాక్సీ సేవలందిస్తున్న ఉబెర్, టెస్లా మోటార్స్ తదితర కంపెనీలు సైతం రీసెర్చ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News