: రాంలీలా మైదాన్ కు క్యూ కట్టిన ఆప్ కార్యకర్తలు
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. రాంలీలా మైదాన్ లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారానికి కేజ్రీవాల్ ఆహ్వానం పలకడంతో ఆప్ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. అంతే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన ఆప్ నేతలు కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఢిల్లీ చేరుకోవడంతో హస్తినలో హోటళ్లన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో హోటళ్లు, భోజనం ధరలకు రెక్కలు వచ్చాయి. కాగా, ప్రమాణ స్వీకారానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు.