: మఫ్లర్ పోయి జాకెట్ వచ్చే... మారిన కేజ్రీవాల్ అవతారం!
పదవి వస్తే సామాన్యుడు కూడా కాస్తంత దర్పం చూపిస్తాడనడంలో సందేహం లేదని మరోసారి రుజువైంది. నిన్నమొన్నటి వరకూ ఢిల్లీలో చలిని తట్టుకునేందుకు దిగువ మధ్య తరగతి, పేదల ప్రధాన కవచం 'ముఫ్లర్'తో తిరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ జాకెట్ ధరించి కనిపిస్తున్నారు. ఢిల్లీ నగరంలో పలు చోట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ వెలసిన కటౌట్లలో ఆయన గ్రే కలర్ కోటు ధరించి కనిపిస్తున్నారు. కాగా, నేడు ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.