: కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న మహిళను ఆసుపత్రిలో నరికి చంపిన దుండగులు
కాలిన గాయాలతో గత మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మణి (20) అనే యువతిని గుర్తుతెలియని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి నరికి చంపారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఈ తెల్లవారుజామున యువతిపై దాడి జరగగా, తీవ్రగాయాలపాలైన యువతి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోగా, ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మహిళ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.