: టపటపా రాలిన లంక సింహాలు!
అప్పటిదాకా బాగా ఆడుతున్న లంక ఆటగాళ్ళు ఒక్కసారిగా తడబడి వరుసగా పెవిలియన్ దారి పట్టారు. 21.5 ఓవర్ల వరకూ ఒక వికెట్ నష్టానికి 124 పరుగులు చేసిన లంక జట్టు, ఆపై 5 పరుగులు కూడా జోడించకుండానే కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్ బౌల్ట్ సంగక్కరను ఎల్బీ రూపంలో, తిరిమన్నేను క్లీన్ బౌల్డ్ రూపంలో పెవిలియన్ దారి పట్టించాడు. వెటోరీ బౌలింగ్ లో జయవర్దనే డక్ అవుట్ అయ్యాడు. దీంతో లంక జట్టు పీకల్లోతు కష్టాల్లో పడినట్లయింది. ప్రస్తుతం లంక జట్టు 25.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.