: సచిన్ లేడుగా... పాక్ తో మ్యాచ్ పోతుందేమో!


ఇప్పటివరకూ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై ఇండియా ఓటమిని ఎరుగదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. వరల్డ్ కప్ పోటీలలో భాగంగా మొత్తం 5 సార్లు ఇండియా, పాకిస్థాన్ దేశాలు తలపడగా, అన్నిసార్లూ పాక్ ఓడిపోయింది. అయితే, ఈదఫా మాత్రం భారత్ గెలుపుపై అభిమానులు 100 శాతం నమ్మకంగా లేరు. ఎందుకంటే సచిన్ ఆడటం లేదుగా! విషయం ఏమంటే, ప్రపంచ కప్ లో భాగంగా పాక్ తో జరిగిన అన్ని మ్యాచ్ లలో సచిన్ టెండూల్కర్ ఆడి, విజయంలో తనవంతు పాత్రను పోషించాడు. గత 20 సంవత్సరాల్లో జరిగిన అన్ని వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొన్న సచిన్ రెండేళ్ళ క్రితం క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. దాన్ని సెంటిమెంట్ గా తీసుకున్న మన వీరాభిమానులు సచిన్ తో పాటే దాయాదిపై గెలుపు రికార్డు కూడా పోతుందేమోనని సామాజిక మాధ్యమాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News