: మళ్లీ రంగంలోకి దిగిన అన్నా హజారే... 24న నిరాహార దీక్ష
సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే ఢిల్లీలో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. రాలేగావ్ సిద్దిలో మీడియాతో మాట్లాడిన అన్నా హజారే, ఈ నెల 24న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద వున్న మైదానంలో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. రైతుల కష్టాలతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తాను పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాసినా, ఇంతవరకు జవాబు రాలేదని అన్నా ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తనకు తోచిన మార్గం ఇదేనని తెలిపారు.