: గిరిజన విద్యార్థులతో టైంపాస్... హాస్టలులో రాత్రంతా గడిపిన ఎంపీ, ఎమ్మెల్యే
వేమనపల్లి మండలంలోని దస్నాపూర్ ఆశ్రమోన్నత పాఠశాలలో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే చిన్నయ్య గత రాత్రి విద్యార్థులతో గడిపారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న వారు అర్ధరాత్రి వరకూ పిల్లల ఆట పాటలు చూసి ఆనందించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ప్రజా ప్రతినిధులు, వారి పుస్తకాలు అడిగి తీసుకొని కొన్ని ప్రశ్నలడిగారు. గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. వీరి వెంట పలువురు టీఆర్‌ఎస్ నేతలు సైతం హాస్టలులో గడిపారు.