: మాజీ సీఎం కిరణ్ చెప్పినదే జరుగుతోంది...కొట్టుకున్న తెలంగాణ, ఏపీ పోలీస్!


రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కొట్టుకునే ప్రమాదం ఉందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన హెచ్చరికలు నిజమవుతున్నాయి. నాగార్జునసాగర్ నుంచి కుడి కాల్వకు నీటిని విడుదల చేయాలని ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులను అడగగా వారు నిరాకరించారు. ముందుకెళ్తున్న వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాట్లు ఎండిపోతుంటే రాజకీయాలేంటని ప్రశ్నించడంతో వివాదం రాజుకుంది. దీంతో తెలంగాణ, ఏపీలు పోలీసులను మోహరించాయి. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి, పరిస్థితి అదుపుతప్పడంతో రెండు రాష్ట్రాల పోలీసులు లాఠీలకు పని చెప్పారు. రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవడంతో ఉన్నతాధికారులు కలుగజేసుకుని సర్దిచెప్పారు. కాగా, ఈ ఘర్షణలో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడ్డవారు ఆంధ్రా పోలీసులా? తెలంగాణ పోలీసులా? అనేది తెలియాల్సి ఉంది. ఏపీ అదనంగా నీటిని వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తుండగా, తెలంగాణ అదనంగా నీటిని వాడుకుందని ఏపీ నేతలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News