: ఏడడుగుల పాకిస్థానీని ఎదుర్కొనేందుకు టీమిండియా ఫీట్లు


ఏడడుగుల పాకిస్థాన్ పేస్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ ను ఎదుర్కొనేందుకు టీమిండియా ప్రణాళికలు రచించింది. పొడగరి బౌలర్ అయిన కారణంగా ఇర్ఫాన్ సంధించే బంతులు కాస్త ఎత్తులో వేగంగా దూసుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో అతనిని ఎదుర్కొనేందుకు స్టూల్ బ్యాటింగ్ ను భారత జట్టు ప్రాక్టీస్ చేసింది. కాగా, ఈ ప్రాక్టీస్ లో టీమిండియా ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయంతోనూ పాల్గొన్నాడు. గాయం బాధపెడుతున్నప్పటికీ భువీ బౌలింగ్ చేయడం విశేషం. రనప్ తగ్గించిన భువీ, బంతుల్లో ఏమాత్రం వాడి తగ్గించడం లేదు. సింగిల్ వికెట్ పెట్టుకుని బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన భువనేశ్వర్ కచ్చితత్వంలో ఏమాత్రం తేడా రాలేదని ప్రాక్టీస్ చూసిన వారు అంటున్నారు. భువీ ఆరంభంలో వికెట్లు పడగొడితే, దానిని కొనసాగించేందుకు ఉమేష్, షమీ ఉన్నారు.

  • Loading...

More Telugu News