: బౌలింగ్ కు వచ్చిన ముప్పేమీ లేదు: గంగూలీ
జట్టులో ఒక్కరు లేనంత మాత్రాన పెద్దగా తేడా ఏమీ ఉండబోదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కామెంటేటర్ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆస్ట్రేలియా వెళ్లేముందు కోల్ కతాలో మాట్లాడుతూ, సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మలేని లోటు కనబడనీయకుండా టీమిండియా బౌలర్లు ప్రదర్శన చేస్తారని అన్నాడు. ఇషాంత్ లేకపోవడం వల్ల భారత బౌలింగ్ విభాగానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని ఆయన చెప్పాడు. అయితే, మిగిలిన బౌలర్లు బాగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రధాన బౌలర్ గా ఉన్న ఇషాంత్ గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.