: ప్రపంచకప్ ఎలా గెలవాలో టీమిండియాకు తెలుసు: గ్యారీ కిర్ స్టెన్


ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయినా, ప్రపంచకప్ ఎలా గెలవాలో భారత్ కు తెలుసునని, ఆస్ట్రేలియా పిచ్ లపై ఎలా ఆడాలో నేర్చుకుందని మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ అన్నాడు. కిర్ స్టెన్ కోచ్ గా ఉన్నప్పుడే ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీని గెలిచిన సంగతి తెలిసిందే. ఇండియాకు మద్దతు పలుకుతూ, ధోనీ సేన టైటిల్ నిలబెట్టుకునే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ పోటీలలో క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్ లు కీలకమని కిర్ స్టెన్ అన్నాడు. భారత్ నాకౌట్ దశకు చేరుతుందని, ఆ తర్వాత ఎలా గెలవాలో కూడా వారికి తెలుసునని అన్నాడు.

  • Loading...

More Telugu News