: హర్యానాలో విడుదలైన డేరా బాబా వివాదాస్పద సినిమా


డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన వివాదాస్పద సినిమా 'మెసెంజర్ ఆఫ్ గాడ్' హర్యానాలో ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాలో వివాదాస్పద అంశాలు చోటుచేసుకున్నాయని, ఈ సినిమా కారణంగా తమ మత విశ్వాసాలు దెబ్బతింటాయని, అందువల్ల ఈ సినిమాను ఆపివేయాలని గతంలో కొందరు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. దీంతో, సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సినిమా ప్రదర్శన సందర్భంగా ఎలాంటి ఆందోళనలు చోటుచేసుకోలేదని, ప్రశాంతంగా ఉందని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News