: వాలెంటైన్స్ డే గిరాకీ... రూ.40 లక్షల విలువచేసే గులాబీలు దిగుమతి చేసుకున్న నేపాల్
ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. ప్రేమ, ప్రేమికులు అనగానే అందుకు చిహ్నంగా భావించే గులాబీ పువ్వులే గుర్తుకొస్తాయి. ఈ నేపథ్యంలో, నేపాల్ రూ.40 లక్షల విలువచేసే లక్ష గులాబీలను భారత్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు నేపాల్ ఫ్లోరీకల్చర్ అసోసియేషన్ తెలిపింది. "ఈ ఏడాది మేము రూ.40 లక్షల విలువచేసే గులాబీలను వాలెంటైన్స్ డే కోసం ఇండియా నుంచి దిగుమతి చేసుకున్నాం" అని అసోసియేషన్ ఛైర్మన్ లోక్ నాథ్ గెయిర్ చెప్పారు. గతేడాది లక్షా 50వేల గులాబీలను నేపాలీ మార్కెట్ కొనుగోలుచేసింది. అందులో 95 శాతం పువ్వులను ఖాట్మండూ వాసులే కొన్నారట. ఈసారి భారత్ లో పూల ధర పెరగడంతో నేపాలీ కొనుగోలుదారులు తక్కువగా దిగుమతి చేసుకున్నారట.