: వామ్మో... ఎంత బంగారం గెలుచుకుందో!


భారత్ కు చెందిన ఆన్ అనే యువతి దుబాయ్ లో ఓ లక్కీ డ్రాలో 20 కిలోల బంగారం గెలుచుకుంది. ఆ బంగారం విలువ రూ. 5 కోట్లు. కేరళకు చెందిన ఈ యువతి కెన్యాలో పెరిగింది. స్ట్రక్చరల్ కేబుల్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఆన్ తన 25వ జన్మదినం సందర్భంగా ఓ ఫ్రెండ్ నుంచి బంగారు కాలి పట్టీల జతను బహుమతిగా అందుకుంది. ఆ నగలతో పాటే మూడు కూపన్లు కూడా ఇచ్చారు దుకాణదారులు. ఇప్పుడా కూపన్లే ఆమెకు పసిడి పంట పండించాయి. షాపు వారు ఆన్ కు ఫోన్ చేసి లక్కీ డ్రాలో గెలుపొందిన విషయం తెలిపారు. ఆన్ కు ఈ వారంలో బంగారం అందజేస్తామని దుబాయ్ గోల్డ్ అండ్ జ్యూయెలరీ గ్రూప్ జనరల్ మేనేజర్ టామీ జోసెఫ్ పేర్కొన్నారు. ఇంత భారీ బహుమతి నెగ్గినా నేల విడిచి సాము చేయబోనని, ఉద్యోగంలో కొనసాగుతానని స్పష్టం చేసింది ఆన్.

  • Loading...

More Telugu News