: పాకిస్తాన్ ను కుమ్మేయండి: అమర్ నాథ్


ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ లో భారత ఆటగాళ్లు సత్తా మేరకు రాణించాలని మాజీ క్రికెటర్ మొహీందర్ అమర్ నాథ్ టీమిండియాకు సూచించాడు. మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టును కుమ్మేయాలని ఆయన అన్నారు. క్రికెట్ గత చరిత్రను పరిశీలిస్తే, పాకిస్థాన్ కు భారత్ మీద వన్డేల్లో మంచి రికార్డు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచకప్ పోటీల్లో మాత్రం ఇంతవరకూ పాక్ తో పోటీల్లో ఇండియాకు ఓటమే లేదని గుర్తుచేశారు. రెండు జట్లలోను మంచి క్రీడాకారులే ఉన్నారని, అయితే, పాకిస్థాన్ మీద ఇండియా గెలవడం అంటూ జరిగితే, అది బ్యాటింగ్ వల్లే అవుతుంది తప్ప బౌలింగ్ వల్ల కాదంటూ మన బౌలర్ల సత్తాపై అమర్ నాథ్ పెదవి విరిచారు. ప్రస్తుత జట్టులో సచిన్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్ లాంటి ఆటగాళ్లతో సరిపోయేవాళ్లు ఎవరూ లేరని కూడా అమర్నాథ్ వ్యాఖ్యానించారు. కాగా, వరల్డ్ కప్ క్రికెట్ పోటీల చరిత్రలో సచిన్ టెండూల్కర్ లేకుండా పాకిస్థాన్ జట్టుతో ఇండియా తలపడటం ఇదే మొదటిసారి.

  • Loading...

More Telugu News