: పెషావర్ లో మసీదు వద్ద బాంబు పేలుళ్లు... 11 మంది మృతి
పాకిస్థాన్ లోని పెషావర్ లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది చనిపోగా, 60 మందికి గాయాలైనట్టు తెలిసింది. మసీదులో ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నట్టు తెలిసింది. ప్రార్థనలు జరుగుతుండగా ఆరేడు పేలుళ్లు సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. దాడి జరిగిన సమయంలో మసీదు లోపల 1000 మంది వరకు ఉన్నారు. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రాంతంలో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. దాడిలో ఏడుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.