: ప్రముఖ నవలా రచయిత కేశవరెడ్డి కన్నుమూత


ప్రముఖ నవలా రచయిత డాక్టర్ పి.కేశవరెడ్డి కన్నుమూశారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన 30 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లాలో స్థిరపడ్డారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కేశవరెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వృత్తి రీత్యా వైద్యుడైన కేశవరెడ్డి జిల్లావ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో సేవలందించారు. ఆయన రాసిన 'అతడు అడవిని జయించాడు', 'మూగవాని పిల్లనగ్రోవి', 'సిటీ బ్యూటిఫుల్', 'మున్నెమ్మ', 'రాముడున్నాడు-రాజ్జిముండాది' వంటి నవలలతో జాతీయస్థాయిలో పేరొందారు. కేశవరెడ్డి మరణానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలుగు సాహితీలోకం మంచి రచయితను కోల్పోయిందని బాబు అన్నారు.

  • Loading...

More Telugu News