: కవితకు కేంద్ర మంత్రి పదవి కోసం... మోదీతో కేసీఆర్ దోస్తీ నాటకాలు: ఎర్రబెల్లి
కుమార్తెకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ దొడ్డిదారిన యత్నాలు ముమ్మరం చేశారని తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన తన కూతురు కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి ఇప్పించుకునేందుకు కేసీఆర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో దోస్తీ నాటకాలు ఆడుతున్నారని ఆయన కొద్దిసేపటి క్రితం ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే కేసీఆర్ మొన్నటి పర్యటనలో ఐదు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారని ఎర్రబెల్లి ఆరోపించారు. తాజాగా, మళ్లీ ఢిల్లీ వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. నిన్నటి చంద్రబాబు వరంగల్ పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నేతలే ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ముసుగులో విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.