: దూకిన స్టాక్ మార్కెట్... 29 వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లకు లాభాల పర్వం కొనసాగుతోంది. నేటి సెషన్లో సెన్సెక్స్ 29 వేల పాయింట్లను అధిగమించింది. మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 265 పాయింట్లకు పైగా పెరిగి 29,070 పాయింట్ల వద్ద, నిఫ్టీ సూచీ 77 పాయింట్లు పెరిగి 8,788 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. అమెరికా డాలర్ తో రూపాయి మారకపు విలువ 62.12గా ఉంది. ఎస్బీఐ, సన్ ఫార్మా, టీసీఎస్, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటో, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాలను, గెయిల్, భెల్, ఓఎన్జీసీ తదితర కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి.