: ఢిల్లీలో క్రైస్తవ పాఠశాలపై దాడిని ఖండించిన కేజ్రీవాల్
దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో క్రైస్తవ పాఠశాలపై దుండగులు ఈరోజు దాడి చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. క్రైస్తవ పాఠశాలపై దాడిని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి దాడులను సహించబోమని ట్వీట్ చేశారు. గురువారం అర్ధరాత్రి కొందరు దుండగులు ఢిల్లీలోని హోలీ చైల్డ్ ఆక్సిలిమ్ పాఠశాలపై దాడి చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే దర్యాప్తు చేపట్టి పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఇదొక దొంగతనం ఘటనగా తేలిందని కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.