: విభజనకు అన్ని పార్టీలు ఒప్పుకున్నా... కాంగ్రెస్ కు మాత్రమే నష్టం జరిగింది: డిగ్గీరాజా


కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న నష్టంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కారణాలను కనుగొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించినా, కాంగ్రెస్ కు మాత్రమే నష్టం జరిగిందని ఆయన తేల్చేశారు. విజయవాడలో జరుగుతున్న పార్టీ మేధోమథన సదస్సుకు హాజరైన ఆయన కొద్దిసేపటి క్రితం పార్టీకి జరిగిన నష్టంపై విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు అకారణంగా తిరస్కరిస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉందని, నేతలంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. పిరికిపందలే పార్టీని వీడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘోరంగా విఫలమవుతోందని డిగ్గీరాజా ఆరోపించారు.

  • Loading...

More Telugu News