: బీజేపీ ఎంపీ కుమార్తె కాబట్టే సోనాక్షీ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు: 'ఏఐబీ రోస్ట్'పై మహేశ్ భట్ స్పందన
దేశంలో చర్చనీయాంశం అయిన 'ఏఐబీ రోస్ట్' వివాదంపై బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ స్పందించారు. ఈ కార్యక్రమంలో అశ్లీలతకు తావిచ్చారంటూ 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తెలిసిందే. వారిలో కరణ్ జోహార్, రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్, దీపికా పదుకొనే, అలియా భట్ తదితరులున్నారు. అయితే, ఆ కార్యక్రమంలో పాల్గొన్న సోనాక్షీ సిన్హా పేరు ఎందుకు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదని మహేశ్ భట్ ప్రశ్నించారు. సోనాక్షీ బీజేపీ ఎంపీ (నటుడు శత్రుఘ్ను సిన్హా) కుమార్తె అయినందునే ఆమె పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదని విమర్శించారు. దీనివెనుక బలమైన శక్తులున్నాయని ఆరోపించారు.