: జయలలిత ఎస్టేట్ లో తిష్టవేసిన చిరుతపులి... ఎట్టకేలకు పట్టివేత!


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఊటీలో ఓ ఎస్టేట్ ఉంది. ఆ ఎస్టేట్ లో ఒక చిరుత ప్రవేశించి అటవీ అధికారులను నానా ఇబ్బందులు పెట్టింది. రోజుల పాటు శ్రమించి అధికారులు ఆఖరుకి ఆ చిరుతను పట్టుకున్నారు. అంతకుముందు, ఆ చిరుత కొన్ని లేగ దూడలను చంపిందని సమీప గ్రామస్తులు తెలిపారు. దీంతో, నాలుగేళ్ల వయసున్న ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు బోనులను, కెమెరాలను ఎస్టేటులో ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు దాన్ని బంధించి భవానీ అడవుల ఎగువభాగాన విడిచిపెట్టారు.

  • Loading...

More Telugu News