: 'నమస్తే తెలంగాణ' పత్రికపై మంద కృష్ణ ధ్వజం
'నమస్తే తెలంగాణ' పత్రిక తీరుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ దినపత్రిక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరపత్రంలా వ్యవహరిస్తోందని విమర్శించారు. నమస్తే తెలంగాణ పత్రిక వ్యవహారశైలిపై తాము ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అటు, ఎస్సీ రిజర్వేషన్ పై ఆయన మాట్లాడుతూ, ఎల్లుండి ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రిలో నిర్వహించే సభలో నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. మాట తప్పడంలో చంద్రబాబు, కేసీఆర్ కవలలని విమర్శించారు.