: దొంగ ఓట్లు వేయిస్తున్నారు... పోలీసులతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి వాగ్యుద్ధం
తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ లో ప్రత్యర్థులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. తిరుపతిలోని నెహ్రూ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తున్న వారిని ఎందుకు అడ్డుకోవడం లేదంటూ పోలీసులను ప్రశ్నించారు. టీడీపీ తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మరణించడంతో అక్కడ ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. టీడీపీ తరపున వెంకటరమణ సతీమణి సుగుణమ్మ, కాంగ్రెస్ తరపున శ్రీదేవి బరిలో ఉన్నారు. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది.