: ఆప్ విజయం వెనుక మోదీ 'ఉడత' సాయం!


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం వెనుక ప్రధాని మోదీ 'ఉడత' సహాయం చేశాడని బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఆయనతో పాటు సాధారణ కార్యకర్త వరకు పరోక్షంగా ప్రచారం చేశారని అంటున్నారు. అసలు విషయం ఏమంటే, గత సంవత్సరం అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధాని మోదీ 'క్లీన్ ఇండియా' పేరుతో 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని చీపురు పట్టుకుని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన చీపురు పట్టి ఊడ్చిన చిత్రాలు నిత్యమూ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. అంతే కాదు, ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులకు ఆయన పిలుపునిచ్చారు. దీంతో, ప్రతిరోజూ చీపురు గుర్తు ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉంది. దీంతో, వేలాది మంది నిరక్షరాస్యులు కమలం గుర్తు మరచి చీపురుకు ఓటేశారని, ఆ విధంగా బీజేపీ ఓటమికి మోదీ కూడా కారణమని, మన తప్పేమీలేదని ఆ పార్టీ నేతలు మెట్ట వేదాంతంతో సర్ది చెప్పుకుంటున్నారట.

  • Loading...

More Telugu News