: ‘హోసూరు’ మృతులకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా: కేంద్రం ప్రకటన


కర్ణాటకలోని హోసూరులో నేటి ఉదయం చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియాను కేంద్రం ప్రకటించింది. బెంగళూరు నుంచి ఎర్నాకుళం వెళుతున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ హోసూరు వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది వ్యక్తులు చనిపోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు. ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సురేశ్ ప్రభు, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.20 వేలను అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News