: తిరుపతి పోలింగ్ సరళిపై కలెక్టర్ కు ఫిర్యాదుల వెల్లువ... ఇద్దరు యువకుల అరెస్ట్
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ తీరుపై చిత్తూరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ లో అధికార పార్టీ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలూ అక్రమాలకు పాల్పడుతున్నారని స్వతంత్ర అభ్యర్థులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలకు అధికార యంత్రాంగం అనుకూలంగా వ్యవహరిస్తుండగా, కాంగ్రెస్ నేతలు కూడా రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని జీవకోనలోని పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేసేందుకు సదరు యువకులు యత్నించారని, ఆ కారణంగానే వారిని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు.