: పాకిస్తాన్ ప్రధానికి ఫోన్ చేసిన మోదీ


పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం ఫోన్ చేశారు. ఎల్లుండి పాకిస్తాన్ తో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మోదీ స్వయంగా షరీఫ్ కు ఫోన్ చేసినట్టు విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. క్రికెట్ గురించి పలు విషయాలు మాట్లాడుకున్న ఇరుదేశాల ప్రధానులు, ఒకరి జట్టుకు ఇంకొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 1992లో పాకిస్తాన్ కప్పు గెలవడాన్ని మోడీ ప్రస్తావించారు. కాగా, రెండు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు ప్రారంభించాలని షరీఫ్ కోరగా, త్వరలో జరిగే కామన్వెల్త్ దేశాల సమావేశానికి కార్యదర్శులను పంపుదామని, అక్కడ వారు తాజా పరిస్థితులు చర్చిస్తారని మోదీ అన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News