: కేజ్రీవాల్ టీం ఇదే... మహిళలకు మొండిచెయ్యి!


రేపు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్ ఏడుగురు సహచరులతో తన కేబినెట్ను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే, ఈ జాబితాలో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదని సమాచారం. కేబినెట్లో మొత్తం ఏడుగురు ఉండగా, అందరూ ఊహించినట్టుగానే మనీష్ సిసోడియాకు ఉపముఖ్యమంత్రి పదవి దాదాపు ఖరారు కాగా, మిగిలిన వారిలో నలుగురు కొత్త వాళ్ళని తెలుస్తోంది. తన మంత్రివర్గ జాబితాను నేటి ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు అందించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వీరిలో సత్యేంద్ర జైన్, అసిఫ్ అహ్మద్, సందీప్ కుమార్ లు ఉన్నట్టు తెలిసింది. గత కేబినెట్లో మంత్రులుగా ఉన్న సోమ్నాథ్ భారతి, రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, గిరీశ్ సోనీలకు ఈసారి చోటు దక్కలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News