: 36 శాతం మంది డేటింగ్ సహోద్యోగులతోనే... 'ఆన్ లైన్ జాబ్స్' సర్వేలో ఆసక్తికర విషయాలు
ఒకే చోట, ఒకే పని చేసే వారి మధ్య ప్రేమ పుట్టే అవకాశాలు అధికమని వాలంటైన్స్ డే నేపథ్యంలో 'ఆన్‌లైన్ జాబ్స్' వెబ్ సైట్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. సర్వే వివరాల ప్రకారం 36 శాతం మంది ఉద్యోగులు కొలీగ్స్ తో డేటింగ్ చేస్తున్నారని, వారిలో 35 శాతం మందికి పైగా వివాహానికి సిద్ధమవుతున్నారని వెల్లడైంది. ఈ సర్వేను గత నెలలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించినట్టు వెబ్ సైట్ తెలిపింది. 56 శాతం మంది తమ సహోద్యోగులపై ఆకర్షణకు గురవుతున్నామని చెప్పగా, మరికొందరు ఆఫీసు రొమాన్స్ కెరీర్ కు ఇబ్బందిగా మారే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. 55 శాతం మంది తమ యజమానితో, 68 శాతం మంది ఉన్నతోద్యోగులతో రొమాన్స్ కు సిద్ధపడ్డట్టు తెలిపారు. సామాజిక మాధ్యమాల భయంతో, 71 శాతం మంది ఉద్యోగులు తమ ఆఫీసు రొమాన్స్ ను రహస్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారట.