: దత్తత గ్రామంలో అభివృద్ధి పనులకు వెంకయ్యనాయుడు శంకుస్థాపన


విశాఖ జిల్లాలో తాను దత్తత తీసుకున్న చేపలుప్పాడ గ్రామంలో కేంద్రమంత్రి వెెంకయ్యనాయుడు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి తావర్ చంద్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు. చేపలుప్పాడ పంచాయతీ పరిధిలోని 5 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామంతో రూ.5.50 కోట్లతో ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి. మంత్రి వెంకయ్య మాట్లాడుతూ, అభివృద్ధి ఫలాలు పేదలకు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. స్వర్ణభారతి ట్రస్టు ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News