: దేవుడు అప్పుడు పరీక్షించాడు, ఇప్పుడు వరమిచ్చాడు: ఆప్


దేవుడు అప్పట్లో తమకు 28 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి... ఎలా నెట్టుకొస్తారోనని పరీక్షించాడని, ఆ పరీక్షలో నెగ్గినందునే, ఇప్పుడు ఏకంగా 67 మంది ఎమ్మెల్యేలను వరంగా ఇచ్చాడని 'ఆప్' నేత మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లను దక్కించుకుని పెద్ద పార్టీలకు షాకిచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా, 49 రోజుల్లోనే తన పాలనకు స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా, తాను నమ్మిన మార్గంలో పయనించిన ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ తాజా ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాగా, దేవుడి పరీక్షలో తాము గెలిచామని, ఇప్పుడు తమ పార్టీలో 67 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఎటువంటి బెంగలేదని మనీష్ తెలిపారు. రేపు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News