: రాయుడూ... బాగా ఆడాలి: ప్రధాని మోదీ ట్వీట్
వరల్డ్ కప్ మ్యాచ్ లు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో, టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటగాళ్లను పేరుపేరునా ఉద్దేశించి ట్వీట్లు చేశారు. తెలుగుతేజం అంబటి తిరుపతిరాయుడిని ప్రోత్సహిస్తూ... "రాయుడూ... బాగా ఆడాలి. కీలక పాత్ర పోషిస్తావన్న నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు. కెప్టెన్ ధోనీపైనా ప్రధాని నమ్మకం వ్యక్తం చేశారు. "ధోనీ, నీ గురించి తెలుసు. నువ్వు సాధించగలవు. దేశం గర్వపడేలా చేయాలి" అని ట్వీట్ చేశారు. ఇక, స్టార్ బ్యాట్స్ మన్ కోహ్లీపై దేశం ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు. రహానే ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. "నువ్వు తీసే వికెట్లు ఎంత త్వరగా మ్యాచ్ గెలుస్తామన్న దానిని నిర్ణయిస్తాయి" అంటూ యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. బాగా ఆడి వికెట్లు తీయాలంటూ బెంగాల్ యువకెరటం మహ్మద్ షమీకి సూచించారు.