: నవ్యాంధ్ర రాజధానికి రూ.100 కోట్లకు పైగా విలువైన భూమి... గణపతి సచ్చిదానంద భూరి విరాళం


నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి దత్తపీఠం పీఠాధిపతి గణపతి సచ్చిదానంద భూరి విరాళం ప్రకటించారు. కృష్ణా కరకట్టపై తనకున్న 6.4 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా అందించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ భూమి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. రాజధానికి భూమిని విరాళమివ్వాలని నిర్ణయించుకున్న ఆయన, భూమి పత్రాలను ప్రభుత్వానికి అందజేయాలని దత్తపీఠం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో, దత్తపీఠం అధికారులు సదరు భూమి పత్రాలను సీఆర్డీఏ అధికారులకు కొిద్దిసేపటి క్రితం అందజేశారు.

  • Loading...

More Telugu News