: '6 ప్యాక్'చూపిన ఫేస్ బుక్!
ప్రముఖ సామాజిక మాధ్యమ వెబ్ సైట్ ఫేస్ బుక్ స్వయంగా '6 ప్యాక్' పేరిట కొత్త హార్డ్ వేర్ నెట్ వర్కింగ్ టూల్ ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఫేస్ బుక్ యాప్స్, ఇతర సేవలు మరింత మెరుగ్గా నెటిజన్లకు అందుతాయని సంస్థ తెలిపింది. స్విచ్ లా పనిచేసే ఈ నెట్ వర్కింగ్ పరికరానికి '6 ప్యాక్' అని పేరు పెట్టారు. ఈ చిన్న పరికరం వల్ల ఫేస్ బుక్ యూజర్లు భారీ నెట్ వర్క్ లను సైతం నిర్మించుకునేందుకు వీలుపడుతుంది. నెట్‌వర్కింగ్ పరికరాలు ఉత్పత్తి చేయడంలో అగ్రగామిగా ఉన్న సిస్కోతో ఈ ఫేస్ బుక్ టూల్ పోటీ పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. జూన్ నుంచి అందుబాటులోకి రానున్న ఈ పరికరం ప్రస్తుతం ఉపయోగిస్తున్న హై కెపాసిటీ స్పైన్ స్విచ్ లతో పోలిస్తే మెరుగ్గా పనిచేస్తుందని ఫేస్ బుక్ అధికారి ఒకరు తెలిపారు.