: కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు... రెండో తరగతి విద్యార్థిని మృతి


నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు కానున్న గుంటూరు జిల్లాలో మరో స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. పాఠశాలకు విద్యార్థులను తరలిస్తున్న స్కూలు బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రెండో తరగతి చదువుతున్న లహరి అనే చిన్నారి బాలిక మృత్యువాతపడగా, మరో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి సమీపంలో నేటి ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో విజ్ఞాన్ విహార్ స్కూలు బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News