: మొరాయించిన ఈవీఎం... తిరుపతి నెహ్రూ నగర్ లో నిలిచిన పోలింగ్


తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పోలింగ్ లో నగరంలోని నెహ్రూ నగర్ లో ఓటింగ్ ప్రారంభం కాలేదు. ఓటింగ్ కు వినియోగించే ఈవీఎం మొరాయించడంతో, అక్కడ ఓటింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఆ ఈవీఎంను అధికారులు సరిచేస్తున్నారు. నగరంలోని నెహ్రూ నగర్ పరిధిలోని 23వ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం మొత్తం 256 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతేకాక తొలిసారిగా ఎన్నికల తీరును పూర్తి స్థాయి వెబ్ కాస్టింగ్ తో ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది.

  • Loading...

More Telugu News