: వైసీపీని వదిలి టీఆర్ఎస్ లో చేరిన తొలి మూర్ఖుడిని నేనే: వైరా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య


ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ నిన్న సంచలన వ్యాఖ్య చేశారు. వైసీసీ టికెట్ పై విజయం సాధించి, టీఆర్ఎస్ లో చేరిన తొలి మూర్ఖుడిని తానేనని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం వైరాలో జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సందర్భంగా మదన్ లాల్ అనుచరులు, టీఆర్ఎస్ కు చెందిన మరో కీలక నేత వర్గానికి చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తన సమక్షంలోనే కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అనవసరంగా వైసీపీని వదిలి టీఆర్ఎస్ లో చేరానని అన్నారు. ‘‘తెలంగాణలో వైసీపీకి మనుగడ లేదని భావించి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరాను. వైసీపీలో పనిచేసినంతకాలం ఏనాడు అభాసుపాలైన సంఘటన లేదు. వైసీపీని వదిలి టీఆర్ఎస్ లో చేరిన తొలి మూర్ఖుడిని నేనే. నలుగురిని వెంటేసుకుని వచ్చి విమర్శలు చేయడం సరికాదు’’ అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News