: ఢిల్లీ ప్రజల తీర్పుతో ఏపీలో బీజేపీలో చేరేందుకు జంకుతున్నారు: కాంగ్రెస్ నేత


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీవైపు ఆశగా చూసిన నేతలు ఆ పార్టీలో చేరేందుకు జంకుతున్నారని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, నిన్న మొన్నటి వరకు బీజేపీలో చేరేందుకు రాయబారాలు, బేరసారాలు నడిపిన కాంగ్రెస్ నేతలు, ఢిల్లీ ఫలితాల తరువాత పునరాలోచనలో పడ్డారని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లే గెలుచుకుని ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోవడంతో, బీజేపీ బలం నీటిమీద బుడగలాంటిదని అందరికీ అర్ధం అయిందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీలో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News