: ఆ షోలో పాల్గొన్న అందరిపైనా కేసు నమోదు చేయండి: ముంబై కోర్టు


బాలీవుడ్ భామలు అలియా భట్, దీపికా పదుకునే, దర్శకుడు కరణ్ జోహర్ మీద కేసు నమోదు చేయాలని ముంబై న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఏఐబీ రోస్ట్ లో పాల్గొన్నందుకు వీరిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు న్యాయస్ధానం సూచించింది. పోర్నోగ్రఫీ తరహాలో ఈ కార్యక్రమం ఉందని, జుగుప్స కలిగేలా వ్యవహరించి, దానికి స్పోర్టివ్ స్పిరిట్ పేరిట సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపారంటూ సామాజిక కార్యకర్త సంతోష్ దౌండ్కర్ ముంబై కోర్టులో కేసు దాఖలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే దీని గురించి పట్టించుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిని విచారించిన న్యాయస్థానం ఎన్ఎస్ సీఐ ప్రెసిడెంట్ జయంతిలాల్ షా, సెక్రటరీ జనరల్ ఎన్ఎస్ సీఐ రవీందర్ అగర్వాల్, ఏఐబీ రోస్ట్ లో పాల్గొన్న కరణ్ జోహర్, అర్జున్ కపూర్, రణ్ వీర్ సింగ్, రోహన్ జోషి, తన్మయ్ భట్, గుర్ శ్రీమన్ ఖంబా, ఆశిష్ షక్యా, అదితి మిత్తల్, రాజీవ్ మసంద్ తో పాటు దీనికి హాజరైన అలియా భట్, దీపికా పదుకునేపై కూడా కేసు నమోదు చేయాలని సూచించింది. దీంతో వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు కానుంది. ఈ షోలో సోనాక్షి సిన్హా, సంజయ్ కపూర్ ఇతర నటీనటులు చాలా మంది హాజరుకావడం విశేషం. ఈ షోలో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అనిల్ కపూర్, షారూఖ్ కపూర్ వంటి వారిపై వేసిన జోక్స్ అసభ్యంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. అమీర్ ఖాన్ దీనిపై బహిరంగంగా విమర్శించగా, ఆ రాత్రి షోలో పాల్గొన్న కొందరికి ఫోన్ చేసి సల్మాన్ హెచ్చరించినట్టు వార్తలు వెలువడ్డాయి. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగడంతో దీని వీడియోను యూట్యూబ్ తొలగించింది.

  • Loading...

More Telugu News