: తెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు నిధుల విడుదల
తెలంగాణలోని నాలుగు జిల్లాల చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కరీంనగర్ జిల్లాలో 27 చెరువులకుగానూ రూ.72 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో 22 చెరువులకు గానూ రూ.38 కోట్లు, వరంగల్ జిల్లాలో 23 చెరువులకు రూ.84 కోట్లు, ఖమ్మం జిల్లాలో 12 చెరువులకోసం రూ.32 కోట్లు మంజూరు చేసింది.